Free schooling For Saiteja Children's: ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన సాయితేజ కుటుంబానికి మంచు విష్ణు అండగా నిలిచారు. సాయితేజ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన విష్ణు.. తమ విద్యా సంస్థలో సాయితేజ పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. పిల్లలను ఇంజినీరింగ్ వరకు ఉచితంగా చదివిస్తామని మంచు విష్ణు వెల్లడించారు.
ఆర్మీ సిఫాయిగా చేరి..
సాయితేజ్.. 2013లో ఆర్మీ సిఫాయిగా చేరాడు. సిఫాయిగా పని చేస్తూ ఏడాది తర్వాత పరీక్షలో ఉత్తీర్ణుడై పారా కమెండోగా ఎంపికయ్యాడు. లెవెన్త్ పారాలో లాన్స్ నాయక్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. బెంగళూరులో సిఫాయిలకు శిక్షకుడుగా పని చేసిన సాయితేజ్.. ప్రస్తుతం బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సాయితేజ్‌కు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు దర్శిని ఉన్నారు. వీరి కుటుంబం గత ఏడాదిగా మదనపల్లె ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటుంది. బుధవారం ఉదయం 8:15కు సాయితేజ్ ఓ సారి ఫోన్ చేశారని.. 8:45 వీడియో కాల్ చేసి పిల్లలతో మాట్లాడారని కుటుంబసభ్యులు తెలిపారు.