శ్రీవారి తమిళ భక్తులకు పవిత్రంగా భావించే పెరటాసిమాసం ఆఖరివారం కావటంతో..తిరుమలకు తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.ప్రస్తుతం వైకుంఠం1,2లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.సాధారణ సర్వదర్శనానికి24గంటలకు పైగా సమయం పడుతోంది.సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు.క్యూలలో వేచి ఉండలేక అనేకమంది భక్తులు దర్శనం చేసుకోకనే వెను తిరుగుతున్నారు.నిన్న సుమారు లక్షమంది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా,రూ.3కోట్ల13లక్షల హుండీ ఆదాయం వచ్చినట్లు తితిదే ప్రకటించింది.
పెరటాసిమాసం..తిరుమలలో తమిళ భక్తుల రద్దీ
తమిళులు పవిత్రంగా భావించే పెరటాసిమాసం ఆఖరివారం కావటంతో తిరుమలలో తమిళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే అధికార్లు నిలిపివేశారు.
పెరటాసిమాసం ఆఖరివారం..తిరుమలలో పోటెత్తిన తమిళ భక్తులు