చిత్తూరు జిల్లా పీలేరు పట్టణం బండ్ల వంకలో బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి తన ఇంటి పైకప్పుకు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆకతాయిలే వేధింపులే తమ కుమార్తె మరణానికి కారణమని తల్లి తెలిపింది.
మద్యం మత్తులో ఆకతాయిల అసభ్య ప్రవర్తన... బాలిక ఆత్మహత్య! - పీలేరులో బాలిక ఆత్మహత్య
చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో ఆకతాయిల వేధింపులు బరించలేకు బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆకతాయిల వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య!
ఆదివారం రాత్రి కొంతమంది ఆకతాయిలు మద్యం మత్తులో తమ ఇంటి మీదికి గొడవకు వచ్చారని, తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయారని.. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని సంపూర్ణ అమ్మ తెలిపింది. ఈ మేరకు పీలేరు పోలీసులకు ఫిర్యాదు తల్లి చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య చీలిక గుర్తింపు