చిత్తూరు జిల్లా మదనపల్లి డివిజన్లోని పూల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కరోనా వైరస్ ప్రభావంతో కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా దుకాణాలన్నీ మూసివేశారు. అలాగే.. శుభకార్యాల వాయిదా.. ఆలయాల మూసివేత... పండగ వేడుకల నిలిపివేతతో పూలు కొనేవారు లేకుండాపోయారు. ఫలితంగా.. తోటల్లోని పూలకు డిమాండ్ లేక.. వాడిపోతున్నాయి. పీలేరు నియోజకవర్గంలో వాల్మీకిపురం గుర్రంకొండ కలికిరి మండలాల్లో కనకాంబరం, సన్న మొగ్గ, గుండు మల్లి, లిల్లీ, చామంతి పూల తోటలు ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతి ఏడాది పూలకు వేసవిలోనే సీజన్ వస్తుంది. మంచి ధరలు పలికేవి. ఇదే తరుణంలో లాక్ డౌన్ కొనసాగుతుండగా.. ఏకంగా 100 హెక్టార్లలో పూల రైతులు నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని.. తగిన సహాయం చేయాలని కోరుతున్నారు.
కరోనా ప్రభావం.. పూల వ్యాపారులకు తీవ్ర నష్టం
కరోనా ప్రభావంతో పూల రైతులు సైతం నష్టాలపాలవుతున్నారు. ఆలయాలు మూసివేయడం, శుభకార్యాలు వాయిదా వేస్తున్న కారణంగా ఎగుమతి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తీవ్ర నష్టాలు మిగులుతున్నాయి. తమను ఆదుకోవాలని పూల వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
కరోనా ప్రభావంతో పడిపోయిన పూలధరలు