ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు కలెక్టరేట్​లో అగ్ని ప్రమాదం

చిత్తూరు కలెక్టరేట్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాందలో దాదాపు 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు.అగ్ని మాపక సిబ్బంది మంటల్నీ అదుపులోకి తీసుకొచ్చారు.

చిత్తూరు కలెక్టరేట్​లో అగ్ని ప్రమాదం

By

Published : Apr 11, 2019, 5:36 AM IST

చిత్తూరు కలెక్టరేట్ కార్యాలయంలోని మూడవ అంతస్తులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.అగ్ని ప్రమాదం కారణంగా సమావేశ మందిరంలో ని నాలుగు ఏసీలు, ఆరు కంప్యూటర్​లు కాలి బూడిదయ్యాయి. వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల పోలింగ్ ను పరిశీలించడానికి కంప్యూటర్లు ల్యాప్ టాప్​లను సమావేశ మందిరంలో భద్రపరిచారు. వాటి కేబుల్స్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.25లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించింనట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details