ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలన అంతా రివర్సే: కొల్లు రవీంద్ర - వైకాపా పాలన అంతా రివర్సే

తిరుమల శ్రీవారి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. వంద  రోజుల పాలనలో వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు.

ex-minister-kollu-ravinmdra-vistit-lord-tirmala-venkaeshwara-swamay

By

Published : Sep 15, 2019, 1:08 PM IST

వైకాపా పాలన అంతా రివర్సే: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శననాంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. వంద రోజుల వైకాపా పాలన అంతా రివర్స్ అంటూ విమర్శించారు. ఇసుక కష్టాలతో అనేకమంది భవన నిర్మాణరంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details