elephants attack on crop: చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రేణిగుంట మండలం మొగలమూడిలో పొలాలపై గజరాజులు దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా మొగలమూడి సమీపంలోని అటవీ ప్రాంతంలో తిష్ఠవేసిన ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రహరీలను, ఇనుప కంచెలను ధ్వంసం చేశాయి.
"నోటికొచ్చిన పైరుపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడు రోజులుగా 3 ఎకరాల్లో పంటలను పూర్తిగా ధ్వంసం చేసేశాయి. పంటపైనే మేము ఆధారపడి జీవిస్తున్నాం. మంటలు వేస్తున్నా, టపాసులు కాల్చినా ఏనుగులు వెళ్లడం లేదు. ఏమీ చేయలేకపోతున్నాం. చెరుకు పంట అంతా ధ్వంసమైపోయింది. మా పొలంలో 60 టన్నుల చెరుకు పంట వచ్చేది. ఏనుగులు తొక్కేయడం వల్ల పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు తోటలోకి వెళ్లాలన్నా... ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం వేస్తోంది. దయచేసి మాకు సాయం చేయండి" -రైతులు