చిత్తూరు జిల్లాలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పోలీసులపైకి స్కూటర్‌ను పోనిచ్చాడు. బుధవారం సాయంత్రం పాకాలలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వాహనదారుడు తాగిన మైకంలో స్కూటర్‌తో పోలీసులపైకి దూసుకొచ్చాడు. ఘటనలో పాకాల ఎస్ఐ రాజశేఖర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సహచర సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు. మందుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో పోలీసులనే ఢీకొట్టాడు - పాకాల తాజా వార్తలు
మద్యం సేవించి వాహనం నడపడమే నేరం. అలాంటిది ఓ వ్యక్తి తాగిన మైకంలో స్కూటర్‌తో ఏకంగా పోలీసులనే ఢీకొట్టాడు. ఎస్సైను గాయపరిచాడు.
drunkard hit police with scooter in chittor district