ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా: ప్రభుత్వానికి అండగా ముందుకొస్తున్న దాతలు

కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌... అనేక మంది పేదల జీవితాల్లో చీకట్లు నింపుతోంది. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, వలస కూలీలు లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు మానవత్వంతో పలువురు ముందుకొస్తున్నారు. తమ వంతుగా వీలైనంత మేర సాయం అందిస్తున్నారు. కష్టసమయంలో మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు.

donors-support
donors-support

By

Published : Mar 28, 2020, 1:25 PM IST

కరోనా: ప్రభుత్వానికి అండగా ముందుకొస్తున్న దాతలు

కరోనా మహమ్మారిపై పోరాటం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పేదలను ఆదుకునేందుకు... పలువురు సాయం అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం సరిపల్లికి చెందిన చిన్నారి వేమూరి మైత్రేయి... 5వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసింది. స్థానిక ఎమ్మెల్యే ఉప్పాల శ్రీనివాసరావుకు చెక్కును ఇచ్చింది. చిన్నారి ఇచ్చిన మొత్తంతో కలిపి 5 లక్షల 95వేలు సొమ్మును సీఎం సహాయనిధికి పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అనంతపురం జిల్లా కదిరిలో భాజపా నాయకుడు దేవానంద్‌ 13 వందల మంది ఆటోడ్రైవర్లకు తాత్కాలిక ఉపశమనం కింద నిత్యావసరాలను పంపిణీ చేశారు. డీఎస్పీ అహ్మద్‌ చేతులమీదుగా వీటిని అందించారు. కడప జిల్లా బస్టాండ్‌లో ఆకలితో అలమటిస్తున్న వృద్ధులు, యాచకులకు శ్రీదత్త సాయి స్వచ్ఛంద సంస్థ ఆహారం అందించి మంచి మనసు చాటుకుంది.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులో సుమారు 80 మంది వలసకూలీలు చిక్కుకుపోయారు. నిబంధనల దృష్ట్యా రాష్ట్రంలోకి అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీసిటీ ఎండీ సన్నారెడ్డి రవీంద్రారెడ్డి సహకారంతో స్థానిక పోలీసులు భోజనాలు ఏర్పాటు చేసి వారి ఆకలి తీర్చారు. తిరిగి చెన్నై పంపించారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కూనేరు, కడర చెక్‌పోస్టు వద్ద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన లారీలు పదుల సంఖ్యలో నిలిచిపోయాయి. ఎటూ వెళ్లలేక సిబ్బంది రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. వారి దీనస్థితి చూసి చలించిన పార్వతీపురం ఎంవీఐ గంగాధర రాజు పులిహోర, బిస్కెట్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఇవీ చదవండి:రోనాపై పోరు: భారత్​కు అమెరికా ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details