చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆకస్మిక తనిఖీ చేశారు. బడికాయలపల్లి గ్రామ సచివాలయాన్ని సందర్శించి రికార్డులను, ఉద్యోగుల పని తీరును పరిశీలించారు. ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని, బాధ్యతారహితంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ సచివాలయ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు.
గ్రామ సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - చిత్తూరు జిల్లా కలెక్టర్ తాజా వార్తలు
చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా.. బడికాయలపల్లి గ్రామ సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డులను, ఉద్యోగుల పని తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు.
గ్రామ సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు