ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో ఘనంగా ముగిసిన ధన్వంతరి మహాయాగం

కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేదవిజ్ఞానపీఠంలో మూడురోజుల పాటు జరిగిన ధన్వంతరి మహాయాగం ఘనంగా ముగిసింది. ఈ మ‌హాయాగంలో అత‌ల‌, విత‌ల‌, సుత‌ల‌, త‌లాత‌ల‌, ర‌సాత‌ల, మ‌హాత‌ల‌, పాతాల వంటి ఏడు హోమ గుండాలలో హోమాలు నిర్వ‌హించారు. 14 లోకాలలోని దేవ‌త‌ల ఆశీస్సులు మాన‌వుల‌కు క‌ల‌గాల‌ని ఈ యాగం నిర్వ‌హించిన‌ట్లు తితిదే వైకాసన ఆగమ పండితులు తెలిపారు.

By

Published : Mar 28, 2020, 8:06 PM IST

Dhanvantari Mahayagam, the grand finale of the Tirumala
తిరుమలలో ఘనంగా ముగిసిన ధన్వంతరి మహాయాగం

తిరుమలలో ఘనంగా ముగిసిన ధన్వంతరి మహాయాగం

తిరుమలలో నిర్వహించిన ధన్వంతరి మహాయాగం నేటితో ముగిసింది. ఈ యాగంలో నాలుగు వేదాలు, సూర్య జపం, అష్టదిక్పాలకులకు సంబంధించిన వేదమంత్రాలను రుత్వికులు పారాయణం చేశారు. ప్ర‌ధాన కుంభ మంత్ర జలాన్ని ధ‌న్వంత‌రి స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆ తీర్థ జ‌లాన్ని తిరుమ‌ల‌లోని జలాశయంలో కలుపుతామ‌ని నిర్వాహకులు అన్నారు. ఈ శక్తి సూర్యరశ్మి ద్వారా వాతావరణంలో కలిసి వాయు రూపంలో అనారోగ్య కారకాలను నశింపజేస్తుంద‌ని వివ‌రించారు.

శ్రీవారి ఆలయంతో పాటు తితిదే అనుభంద ఆలయాల్లో కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని తిరుమల ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. తిరుపతిలో ఆకలి ఇబ్బందులు లేకుండా నిత్యం 30 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే 50 వేల మందికి పంపిణీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుచానురులోని పద్మావతి నిలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించుకునే ఏర్పాట్లు చేశామన్నారు వెల్లడించారు.

ఇదీ చదవండి.

వలస కూలీల కష్టాలు..రాష్ట్ర సరిహద్దుల్లో వదిలేసిన కాంట్రాక్టర్​

ABOUT THE AUTHOR

...view details