తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు ఆన్‌లైన్ ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టికెట్లు కలిగి ఉండటంతోపాటు రెండు డోసుల వ్యాక్సినేషన్, 72 గంటల ముందు పరీక్షించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టును తీసుకువచ్చిన వారినే అనుమతిస్తామని తితిదే సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు, తితిదే సీవీఎస్‌వో సమీక్ష సమావేశం నిర్వహించారు.
SALAKATLA BRAHMOTSAVALU: దర్శన టికెట్లు, టీకా పత్రం ఉంటేనే అనుమతి - ఏపీ లేటెస్ట్ న్యూస్
కరోనా రెండు డోసుల టీకా, 72 గంటల ముందు పరీక్షించుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులతో పాటు ఆన్‌లైన్ ప్రత్యేక ప్రవేశదర్శనం, సర్వదర్శనం టికెట్లు కలిగిన వారికి మాత్రమే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అనుమతి ఉంటుందని తితిదే సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి తెలిపారు.
దర్శన టికెట్లు, టీకా పత్రం ఉంటేనే అనుమతి
ఈ సందర్భంగా సీవీఎస్‌వో మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తితిదే నిఘా, భద్రతా విభాగం పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సమీక్షలో అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, వీజీవో బాలిరెడ్డి, ఏవీఎస్‌వోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:RAINS IN AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు వర్షాలు