చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో సాగవుతున్న దోస పంటను కొనేవారు లేకపోవడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. లాక్డౌన్ సందర్భంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితితో దోసకాయలు తోటల్లోనే కుళ్లిపోతున్నాయి. రైతుల కంట కన్నీళ్లు తెప్పిస్తోంది. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి తాము పండించిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలు కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు.
లాక్డౌన్ వేళ.. రైతన్నల గోస - lock down effect on farmers
దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన వేళ కర్షకుల కష్టాలు తీవ్రతరం అవుతున్నాయి. తాము పండించిన పంటను విక్రయించే మార్గం లేక అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు నిత్యావసర వస్తువుల కొరత, మరోవైపు రైతన్నల అవస్థ.. వెరసి సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పంటను తరలించేందుకు రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు.
చిత్తూరు జిల్లా పీలేరులో పాడవుతున్న దోస పంట