భాజపా, వైకాపాలకు ప్రత్యామ్నాయంగా.. తమ అభ్యర్థిని గెలిపించాలని సీపీఎం నాయకులు కోరారు. తిరుపతిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరావు, మద్దతిచ్చిన పార్టీల నాయకులు, శ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపాలు ప్రజలకు సుపరిపాలన అందించటంలో విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరావు ఆరోపించారు.
'భాజపా, వైకాపాకు ప్రత్యామ్నాయంగా సీపీఎం అభ్యర్థిని గెలిపించండి'
తిరుపతి సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలో భాజపా, వైకాపాకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
తిరుపతిలో సీపీఎం సమావేశం