చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బీ.కొత్తకోట రెవెన్యూ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవకతవకలు జరుగుతున్నాయని సీపీఐ నియోజకవర్గం నాయకుడు మనోహర్‌రెడ్డి ఆరోపించారు. జాబితాలో చాలా మంది నిరుపేదలు అర్హులైనప్పటికీ వారికి చోటు దక్కలేదని పేర్కొన్నారు. మరోసారి అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది పరిశీలించి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు దక్కేలా జాబితా సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవకతవకలపై సీపీఐ నిరసన - పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ నిరసన వార్తలు
ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో పేదలకు అన్యాయం జరుగుతోందని సీపీఐ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజక వర్గ నాయకుడు మనోహర్‌రెడ్డి ఆరోపించారు. బీ.కొత్తకోట రెవెన్యూ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో అవకతవకలపై సీపీఐ నిరసన