‘ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దై జైలుకు వెళ్లాలని కోరుకోవడం అవివేకం. పొరపాటున అదే జరిగితే ఆయనకే లాభం చేకూరుతుంది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఆయన మాట్లాడారు.
‘జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడం సరికాదు. తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తరహాలో రఘురామ పార్టీ నుంచి బయటకొచ్చి పోరాటం చేస్తే బాగుంటుంది. ఒకవేళ జగన్ బెయిల్ రద్దు అయితే జరిగే నష్టం ఏమీ ఉండదు. 16 నెలలు జైలులో ఉన్నారన్న సానుభూతితో గత ఎన్నికలో ఆయన గెలిచారు. ప్రజా క్షేత్రంలోనే జగన్‌ను ఓడించాలి’ - నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి