ప్రభుత్వ భూములను వేలం వేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలన సాగించడం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహించారు. భూములు పెరగవని... కేవలం జనాభా మాత్రమే పెరుగుతుందన్న అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు.
జనాభా పెరగకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తారా.. అని ఎద్దేవా చేశారు. రానున్న తరాలకు భూములు అవసరమైతే ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రైవేటు భవనాల్లో నడుపుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు.. ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మించాలని సూచించారు. తక్షణమే ప్రభుత్వ భూముల విక్రయాలను నిలిపివేయాలన్నారు.