ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీసీలకు ఏదో చేశామని చెప్పుకోవటానికే కార్పొరేషన్ల నాటకం' - బీసీ కార్పోరేషన్లపై తెదేపా నరసింహ యాదవ్ కామెంట్స్

గత ప్రభుత్వం తితిదే ఛైర్మన్, తుడా ఛైర్మన్ వంటి కీలక పదవులను బీసీలకు కేటాయించి అసలైన బీసీ పక్షపాతిగా వ్యవహరించిందని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ విమర్శించారు. వైకాపా బీసీలకు ప్రతిరంగంలోనూ అన్యాయం చేస్తూ...కార్పొరేషన్ల ఛైర్మన్​ పదవుల పేరుతో కొత్త నాటకానికి తెర తీసిందని దుయ్యబట్టారు.

బీసీలకు ఏదో చేశామని చెప్పుకోవటానికే కార్పోరేషన్ల నాటకం
బీసీలకు ఏదో చేశామని చెప్పుకోవటానికే కార్పోరేషన్ల నాటకం

By

Published : Oct 20, 2020, 10:03 PM IST

వైకాపా ప్రభుత్వం బీసీలకు ప్రతి రంగంలోనూ అన్యాయం చేస్తూ...కార్పొరేషన్ల ఛైర్మన్​ పదవుల పేరుతో కొత్త నాటకానికి తెర తీసిందని తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు నరసింహ యాదవ్ విమర్శించారు. గత ప్రభుత్వం తితిదే ఛైర్మన్, తుడా ఛైర్మన్ ఇలా కీలక పదవులను బీసీలకు కేటాయించి అసలైన బీసీ పక్షపాతిగా వ్యవహరించిందన్నారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కావల్సినంత మంది సలహాదార్లను పెట్టుకొని..మంత్రివర్గానికే పని లేకుండా చేసిందంటూ ఎద్దేవా చేశారు.

కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో... నియమించిన ఛైర్మన్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. కేవలం బీసీలకు ఏదో చేశామని చెప్పుకోవటానికే కార్పొరేషన్ల నాటకానికి వైకాపా తెరతీసిందంటూ నరసింహ యాదవ్ మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details