ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అటు కరోనా.. ఇటు నిర్లక్ష్యం.. మధ్యలో విలవిల్లాడుతున్న జనం - చిత్తూరులో వైద్యుల నిర్లక్ష్యం వార్తలు

చిత్తూరు జిల్లాలో ఒక వైపు కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తుంటే మరో వైపు అధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తొంది. కరోనా అనుమానితులున్న వికృతమాల క్వారంటైన్ సెంటర్లో అధికారులు కరోనా నెగిటివ్​ ఉన్న రోగులకు బదులుగా కరోనా పాజిటివ్​ వచ్చిన మహిళలను డిశ్చార్జ్​ చేయడం కలకలం రేపుతోంది.

corona positive cases dicharged
చిత్తూరులో కరోనా రోగుల డిశ్చార్జ్​లో గందరగోళం

By

Published : May 13, 2020, 7:50 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల డిశ్చార్జ్​లో అధికారుల నిర్లక్ష్యంతో గందరగోళం నెలకొంది. క్వారంటైన్​లో కరోనా నెగిటివ్​ వచ్చిన రోగులకు బదులుగా కరోనా బాధితులను డిశ్చార్జ్​ చేశారు. కరోనా అనుమానితులను వికృతమాల క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. వీరి శాంపుల్స్​ను పరీక్షలకు పంపించిన అధికారులు, ఫలితాలు రాకుండానే డిశ్చార్జి ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపింది.

వీ.కోటకు సంబంధించిన నలుగురు మహిళలకు ఫలితాల్లో పాజిటివ్ రాగా అప్పటికే వీరికి నెగటివ్ వచ్చిందంటూ అధికారులు క్వారంటైన్ కేంద్రం నుంచి డిశ్చార్జి చేశారు. అనంతరం తప్పు తెలుసుకున్న అధికారులు పాజిటివ్ వచ్చిన ఆ నలుగురు మహిళలను తిరిగి క్వారంటైన్ కేంద్రానికి రప్పించారు. పూర్తి స్థాయిలో ఫలితాలు రాకుండానే ఇలా ఎలా చేస్తారంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details