ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కంటైన్​మెంట్ జోన్​లలో నిబంధనలు కఠినతరం'

తిరుపతి కంటైన్​మెంట్ జోన్​లలో నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.

containment zones
తిరుపతిలో కంటైన్​మెంట్ జోన్లు

By

Published : Jul 16, 2020, 5:37 PM IST

తిరుపతిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్​మెంట్ జోన్లుగా ప్రకటించి... ఆయా ప్రాంతాల్లో రాకపోకలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఎయిర్ బైపాస్ రోడ్​ పరిధిలో కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి.

ఆ ప్రాంతంలో ప్రధాన రహదారి అయిన అన్నమయ్య కూడలి నుంచి లక్ష్మీపురం కూడలి వరకు రాకపోకలు నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయటికి వస్తున్న వారికి కరోనాపై అవగాహన కల్పిస్తూ తిప్పి పంపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details