చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో పనిచేస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే రోజా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో అహర్నిశలూ శ్రమిస్తున్న వైద్యారోగ్య సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ చిరు కానుక అందజేస్తున్నట్లు తెలిపారు.
వైద్యసిబ్బందికి నిత్యావసర వస్తువుల పంపిణీ - వైద్యసిబ్బందికి నిత్యవసర వస్తువుల పంపిణీ
కరోనా మహమ్మారి కట్టడిలో వైద్యసిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో వైద్య సిబ్బందికి ఆమె నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
వైద్యసిబ్బందికి నిత్యవసర వస్తువుల పంపిణీ
విశాఖ దుర్ఘటన తనను ఎంతో బాధించిందనన్నారు రోజా. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి మృతుల కుటుంబాలను ఆదుకున్నారని తెలిపారు. తన పాలన దక్షతతో జగన్ దేశ మేధావుల ప్రశంసలు పొందుతున్నారని కొనియాడారు.