చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అపోలో యాజమాన్యంతో సమావేశమయ్యారు. రుయాలో ఉన్నట్లు స్విమ్స్‌లో రెడ్ క్రాస్ సంస్థ సమాచార కేంద్రం ఏర్పాటు, రుయా, స్విమ్స్ లో ఫ్రంట్ లైన్ కొవిడ్ పరీక్షలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీ పద్మావతీ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో విధిగా సివియర్, క్రిటికల్ కేసులు మాత్రమే అడ్మిషన్ జరిగేలా చూడాలని, ఇప్పుడు విష్ణునివాసం, ఆయుర్వేద ఆసుపత్రిలలో సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.
మరో మూడు నాలుగు రోజుల్లో అమర, డీబీఆర్, ఎస్ఎల్వీ., పూర్ణాస్, నారాయణాద్రి ఆసుపత్రులు కొవిడ్ సేవలకి రానున్నాయని, ఇప్పటికే లోటస్ లో సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ఇక్కడ ఒత్తిడి తగ్గుతుందని చర్చించారు.