చంద్రప్రభ వాహనంపై ఆశీనులైన శ్రీ గోవిందరాజస్వామి - Sri Govindarajaswamy Temple latest news
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సావాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాహన సేవలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న వాహన సేవలు కరోనా ప్రభావంతో ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. చంద్రప్రభపై ఆశీనులైన స్వామివారికి అర్చకులు వైదికకార్యక్రమాలను నిర్వహించారు. కర్పూర హారతులు, నైవేద్యాలను సమర్పించారు. పెద్దజీయర్ స్వామి బృందం సాత్తుమొరా నిర్వహించారు.
ఇదీ చదవండి..శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గజవాహన సేవ