చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆదివారం జరగనున్న రీపోలింగ్ లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి పీఎస్. ప్రద్యుమ్న హెచ్చరించారు. పోలింగ్ రోజు విధులు నిర్వహించనున్న ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు సూచనలు చేశారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పొరపాట్ల వల్లే రీపోలింగ్ వచ్చిందని స్పష్టం చేశారు. ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలని సూచించారు.
ఈ సారైనా అప్రమత్తంగా ఉండండి: చిత్తూరు కలెక్టర్
అధికారల పొరపాట్ల వల్లే చంద్రగిరిలో రీపోలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి అన్నారు. రీ పోలింగ్లో ఐనా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ సారైనా అప్రమత్తంగా ఉండండి: చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి