Chandrababu letter to chittor collector: చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ వర్శిటీలో కల్తీ ఆహారం తిని 28 మంది విద్యార్ధినులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని.. తెదేపా అధినేత చంద్రబాబు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలని లేఖ ద్వారా కలెక్టర్‌ను కోరారు. బాధితులకు సరైన న్యాయం జరగాలంటే విద్యార్ధుల్లో ధైర్యం పెంచేలా బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.