ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కటారి ప్రవీణ్ మరణం కలచివేసింది: చంద్రబాబు - chandrababu condolence latest news

చిత్తూరు మాజీ మేయర్ భర్త.. కరోనాతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన మాజీ మేయర్ కుటుంబానికి తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు.

chandrababu
చంద్రబాబు

By

Published : Apr 26, 2021, 10:23 AM IST

చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్ కరోనా మృతి చెందడం పట్ల.. తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కటారి ప్రవీణ్ కుటుంబం మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని, పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రవీణ్ తండ్రి కటారి మోహన్ చిత్తూరు మేయర్​గా ఉన్న సమయంలోనే హత్య చేయబడ్డారన్నారు. ఇప్పుడు కరోనాతో ప్రవీణ్ మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రవీణ్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details