తిరుపతి పరిసరాల్లో వినియోగదారులకు ఇసుక ధర తగ్గనుంది. కడప జిల్లా నుంచి దిగుమతి చేసుకోవడంతో రవాణా భారం పెరిగిన క్రమంలో టన్ను ఇసుక రూ.860 వరకు చెల్లించాల్సి వచ్చేది. ఇటీవల ఇసుక విధానంలో ఉన్నతాధికారులు మార్పులు తీసుకువచ్చారు. కడప జిల్లా నుంచి ఇసుక సేకరణ నిలిపివేయాలని నిర్ణయించారు. తిరుపతి నుంచి 105 కి.మీ దూరం వెళ్లి ఇసుక తీసుకురావడంతో రవాణా భారంతో పాటు జిల్లా ఆదాయానికి గండి పడుతున్నట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోని వనరులు వినియోగించుకోవడం ద్వారా సీనరేజ్ రూపంలో వచ్చే పన్నులు జిల్లాకు వర్తిస్తాయనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం నాగలాపురంలోని రీచ్ నుంచి ఇసుకను రేణిగుంట సమీపంలోని గాజులమండ్యం స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నారు. కడప నుంచి సేకరించిన నిల్వల విక్రయం పూర్తి అయిన అనంతరం టన్ను ఇసుకను రూ.600 వంతున విక్రయించాలని అధికారులు నిర్ణయించారు.
దూరం నుంచి సేకరణ ఎందుకో..