ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నమో భూతనాథ.. నమో దేవదేవ

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. భూత రాత్రిని పురస్కరించుకుని.. భూత, శుక వాహనాలపై ఆదిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు.

Celebrators marching on ghost and shuka vehicles
నమో భూతనాథ.. నమో దేవదేవ

By

Published : Mar 9, 2021, 12:25 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. భూత రాత్రిని పురస్కరించుకుని సూర్యప్రభ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. సర్వాంతర్యామి అయిన సోమస్కందమూర్తి రాత్రి భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారి వెంట జ్ఞానాంబిక అమ్మవారు చిలుక వాహనంపై కొలువుదీరారు. ఉదయం సూర్యప్రభపై రాగా.. రాత్రి పుష్పాలతో సిద్ధం చేసిన చంద్రప్రభలపై ఉత్సవమూర్తులు భక్తులకు దర్శనమిచ్చారు శివ పరివారమంతా కదిలిరావడంతో చతుర్మాడ వీధులు పులకించిపోయాయి.

నేడు గాంధర్వరాత్రి

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గాంధర్వరాత్రిని పురస్కరించుకుని ఉదయం స్వామి, అమ్మవార్లు హంస, యాళీ వాహనాలపై ఊరేగగా.. రాత్రి శివునికి అత్యంత భక్తుడైన రావణబ్రహ్మపై.. అమ్మవారు మయూర వాహనంపై చతుర్మాడ వీధుల్లోని భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు.

ఇదీ చూడండి:'విశాఖ ఉక్కు, అనుబంధ సంస్థల్లో 100 శాతం వాటాలు అమ్మేస్తాం'

ABOUT THE AUTHOR

...view details