తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలోకి ఆగంతుకుడు చొరబడి చోరీకి యత్నించిన వ్యవహారంపై తితిదే స్పందించింది. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించినట్లు పేర్కొంది. ఆలయంలోని పరకామణి పక్కన నిందితుడు దాక్కోవటంతో భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారన్న తితిదే.. అందుబాటులో ఉన్న వేరే గది తాళాలతో హుండీని తెరిచేందుకు విఫలయత్నం చేసినట్లు పేర్కొంది. హుండీ తెరుచుకోకపోవటంతో నిందితుడు వెళ్లిపోయాడన్న తితిదే.. ఆలయంలో ఎలాంటి నగదు, వస్తువులు చోరీ కాలేదని స్పష్టతనిచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు తితిదే విజిలెన్స్, తిరుపతి అర్బన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రకటించింది.
ఆలయంలో నగదు, వస్తువులు చోరీ కాలేదు: తితిదే
తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలోకి ఆగంతుకుడు ప్రవేశించి చోరీకి యత్నించడంపై తితిదే స్పందించింది. ఆలయంలో ఎలాంటి వస్తువులు నగదు, చోరీ కాలేదని స్పష్టత నిచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు తితిదే విజిలెన్స్, తిరుపతి అర్బన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రకటించింది.
శ్రీగోవింద రాజస్వామి