ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లల్లో నైపుణ్యాలను వెలికితీయడానికే ఇలా..! - bigg boss program at thamballapalle

కరోనా వల్ల పలు రంగాలు ఆర్థికంగా నష్టపోయాయి. విద్యా వ్యవస్థ సందిగ్ధంలో పడింది. చిన్నారులు ఇళ్లలోనే ఉండటంవల్ల.. వారిలో కొంతమేర చదువులపట్ల అశ్రద్ధ మొదలవుతోంది. దీనిని అధిగమించడానికి బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ, చిత్తూరు జిల్లా పోర్డు స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ' కరోనా బిగ్ బాస్ హౌస్ కార్యక్రమాన్ని తంబళ్లపల్లిలో నిర్వహిస్తున్నాయి.

తంబళ్లపల్లిలో కరోనా బిగ్ బాస్ హౌస్ కార్యక్రమం
తంబళ్లపల్లిలో కరోనా బిగ్ బాస్ హౌస్ కార్యక్రమం

By

Published : Jul 11, 2020, 3:03 PM IST

తంబళ్లపల్లిలో కరోనా బిగ్ బాస్ హౌస్ కార్యక్రమం

పిల్లల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో.. ఫోర్డు స్వచ్ఛంద సంస్థ, బెంగళూరుకు చెందిన క్రై సంస్థ కలిసి సంయుక్తంగా 'కరోనా బిగ్ బాస్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో నైపుణ్యం పెంచే పది అంశాలపై శిక్షణ ఇస్తోంది. వారానికి ఒక రకం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పేద విద్యార్థులను సాంకేతిక విద్య వైపు మళ్లిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావంతో చదువులకు దూరమై పిల్లల్లో విద్య పట్ల నెలకొన్న ఆందోళన తొలగిస్తూ... స్వచ్ఛంద సంస్థలు విద్య అభివృద్ధి కార్యక్రమాల వైపు చైతన్య పరుస్తున్నారు. ఈ క్రమంలోనే.. బిగ్ బాస్ హౌజ్ పేరిట విద్యార్థులతో మాట్లాడారు. వారిని ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు.

విద్యాభివృద్ధి, సృజనాత్మకత, నైపుణ్యం పెంపు, ఆటపాటలు, పాఠ్యాంశాలు, గ్రామ పరిస్థితులు, సంస్కృతి, కరోనా, సీజనల్ వ్యాధులు, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై పిల్లల్లో అవగాహన కల్పించారు. పిల్లలు గతంలో విద్యాలయాల్లో చదివిన అంశాలు మర్చిపోకుండా, చెడు వ్యసనాలవైపు మళ్లకుండా చైతన్య కార్యక్రమాలు చేస్తున్నారు. వికాసం కోసం ఇలా చేస్తున్నామని బెంగళూరుకు చెందిన క్రై, తంబళ్లపల్లి ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు సునీల్, లలితమ్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తంబళ్లపల్లి, పెద్దమండ్యం మండలాల సమన్వయకర్త ఆవుల నరసింహుల బృందం అమలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details