కలికిరిలో అబ్దుల్ కలాం వర్ధంతి - death anniversery
క్షిపణి పితామహుడు,మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని చిత్తూరు జిల్లా కలికిరిలో నిర్వహించారు.
కిలికిరిలో అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవలను చిత్తూరు జిల్లా కలికిరిలో పలువురు స్మరించుకున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా.. నివాళి అర్పించారు. చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడు రామేశ్వరంలోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ... దేశానికి ప్రథమ పౌరుడుగా... క్షిపణి పితామహుడిగా పేరుగడించారని జీమీ యూత్ ఏహింద్ జిల్లా కార్యదర్శి ముస్తఫా హజరత్ కొనియాడారు.