చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఏనుగుల బెడద తీవ్రమైంది. శేషాచల అటవీ సమీప గ్రామాలైన శేషాపురం, కందులవారిపల్లె, మామిడి మానుగడ్డలలో వరి, మామిడి పంటలపై ఏనుగుల గుంపు దాడులు చేశాయి. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి డప్పులు, బాణసంచాతో శబ్ధాలతో గజాలను దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరిమేశారు. గ్రామాలకు అతి సమీపంలో ఏనుగులు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు లోనవుతున్నారు. ఇకనైనా అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఈ మృగాలు పంట పొలాలపై రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు .
ఏనుగులు వచ్చాయ్... పంటలను నాశనం చేశాయ్ - LOSS
చంద్రగిరి మండలంలో ఏనుగుల బెడదతో గ్రామస్తులు భయందోళనలకు గురవుతున్నారు.
ఏనుగుల బెడదతో గ్రామస్తులు భయందోళనలు