చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమం రసాబాసగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పోటీగా పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తుండగా తెదేపా నేతలు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.