చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్య మందు పంపిణీ చేసేందుకు ముక్కోటి తీర్థంలో ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆనందయ్య శక్తి బృందం నేతృత్వంలో మందు తయారీని ప్రారంభించారు. సోమవారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. లక్షా 60వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేలా ప్రణాళికలు రచించినట్లు ఆయన తెలిపారు.
ఆనందయ్య మందు పంపిణీకి ముక్కోటి తీర్థంలో ఏర్పాట్లు
ఆనందయ్య మందు రేపటి నుంచి పంపిణీ చేయనున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మందును అందించేందుకు ముక్కోటి తీర్థంలో ఏర్పాట్లు చేశారు. ఆనందయ్య శక్తి బృందం నేతృత్వంలో మందు తయారీని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు.
distributions