ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

WOMEN RAILWAY STATION: ఆ రైల్వే స్టేషన్​లో పనిచేసేవాళ్లంతా.. మగువలే - ఏపీ 2021 వార్తలు

ఆకాశంలో సగం.. అవకాశంలో సగం.. కాదు కాదండోయ్.. ఆకాశంలో మొత్తం.. అవకాశంలో కూడా మొత్తమే అంటూ రైల్వేశాఖ సరికొత్త ప్రయోగానికి నాంది పలికింది. ఓ రైల్వే స్టేషన్​లో కీ ఉమెన్ నుంచి సూపరింటెండెంట్ దాకా మొత్తం మగువలనే నియమించింది. వారు సమర్థవంతంగా పనిచేసేలా ప్రోత్సాహాన్నివ్వడంతో... స్టేషన్​లో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

all-are-women-employees-in-chadragiri-railway-station-at-chithhor
ఆ రైల్వే స్టేషన్​లో పనిచేసేవాళ్లంతా.. మగువలే

By

Published : Sep 1, 2021, 2:14 PM IST

రైల్వేశాఖ చేపట్టిన ఓ ప్రయోగాన్ని విజయవంతం చేసే బాధ్యత వారందరి మీదా పడింది. అంతమాత్రాన ఒత్తిడికి తలొగ్గలేదు. ఏం జరుగుతుందోనని బెంగపడలేదు. కీ ఉమన్‌ నుంచి సూపరింటెండెంట్‌ దాకా ఓ రైల్వేస్టేషన్‌లోని బాధ్యతలన్నీ చేపట్టిన అతివలు.... మగవారికి తీసిపోని విధంగా తమ కర్తవ్యాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దక్షిణాదిన తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన చంద్రగిరిపై ప్రత్యేక కథనం.

ఆ రైల్వే స్టేషన్​లో పనిచేసేవాళ్లంతా.. మగువలే

14 విభాగాల బాధ్యతలు...

మహిళా సాధికారతే లక్ష్యంగా రైల్వేశాఖ కల్పించిన అవకాశాన్ని అందిపుచ్చుకున్న మగువలు... సత్తా చాటుతున్నారు. దక్షిణ భారతంలో... తొలి మహిళా రైల్వేస్టేషన్‌గా పేరొందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి స్టేషన్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న ఈ స్టేషన్‌లో సూపరింటెండెంట్‌, ముగ్గురు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు సహా.... 14 విభాగాల బాధ్యతలు మహిళలే చూసుకుంటున్నారు.

ఆ స్టేషన్ వద్ద ఏరోజూ సమస్య రాలేదు..

మొదట్లో కొన్ని సవాళ్లు ఎదురైనా.... ఉన్నతాధికారుల సహకారంతో అన్నింటికీ అలవాటు పడ్డామని చంద్రగిరి రైల్వేస్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. రైళ్ల రాకపోకల్లో చంద్రగిరి స్టేషన్ వద్ద ఏనాడూ ఇబ్బంది ఎదురవలేదని.... ఈ మార్గంలో వెళ్లే గార్డులు చెబుతున్నారు. చంద్రగిరి స్టేషన్‌ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా..... రైల్వేశాఖ ప్రయోగాన్ని మహిళలు విజయవంతం చేశారు.

ఇదీ చూడండి:నేడు అప్పికట్ల జోసెఫ్‌ 25వ వర్ధంతి.. ఆయన పేరిట తపాలా కవరు, స్టాంపు ఆవిష్కరణ..

ABOUT THE AUTHOR

...view details