సద్దుమణిగిన గొడవ.. యథావిధిగా పోలింగ్ - tdp
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో వివాదాల మధ్య పోలింగ్ కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా నేతల మధ్య రగడతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. సమస్య ఉద్ధృతం కాకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టడంతో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో వివాదాల మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా నేతల మధ్య రగడతో కొంత సమయం ఉద్రిక్తమైంది. శ్రీకాళహస్తి మండలం ఎంపేడు, ఏర్పేడు మండలం పల్లం, మోదుగులపాలెం, ఏర్పేడులో వివాదాలు నెలకొన్నాయి. సమస్య ఉద్ధృతం కాకుండా పోలీసులు ముందస్తుగా చర్యలు చేపట్టడంతో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మండే ఎండను సైతం లెక్కించకుండా వృద్ధులు ,వికలాంగులు, చంటి బిడ్డ తల్లిలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయాన్నే ఈవీఎం యంత్రాలు మొరాయించడంతో ప్రస్తుతం పోలింగ్ సరళి మందకొడిగా సాగుతోంది.