ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆయనకు కాలిక్యూలెటర్ అక్కర్లేదు! - tirupati

తిరుపతికి చెందిన జయప్రకాష్ తన అసమాన ప్రతిభతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ప్రయత్నం చేశాడు. ఓ యాభై అంకెల సంఖ్యను తీసుకుని కేవలం 4.15 నిమిషాల్లో 25తో గుణించి సరికొత్త రికార్డును నమోదు చేశారు.

ఆయనకు కాలిక్యూలెటర్ అక్కర్లేదు!

By

Published : Jun 27, 2019, 5:57 PM IST

a mathematician trial to hold a record in limca book of records

యాభై అంకెల సంఖ్యను మెదడులో గుర్తు పెట్టుకుని కాలిక్యులేటర్ సహాయం లేకుండా 25తో గుణించి కచ్చితమైన సమాధానం చెప్పటం జయప్రకాష్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తిరుపతికి చెందిన జయప్రకాష్ ఈ విద్య ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కు ప్రయత్నం చేశాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జయప్రకాష్.. కంప్యూటర్ ద్వారా రేండమ్గా ఓ యాభై అంకెల సంఖ్యను తీసుకుని కేవలం 4.15 నిమిషాల్లో 25తో గుణించి సరికొత్త రికార్డును నమోదు చేశారు. ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత గణితాచార్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేదిక్ మ్యాథ్స్ సూత్రాలు, ఏకాగ్రతతో సంవత్సరం పాటు కృషి చేయటం వలనే ఈ విజయాన్ని సాధించగలిగినట్లు జయప్రకాష్ రెడ్డి తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details