చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండోరోజు మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి 50శాతం ధరలు పెంచటంతో.... సవరణ కోసం మధ్యాహ్నం దాకా మద్యం దుకాణాలు మూసే ఉంచారు. సాయంత్రం ప్రారంభమైన మద్యం దుకాణాల వద్ద మందుబాబులు మళ్లీ బారులుతీరారు. మద్యం కోసం గంటల తరబడి వేచిచూసిన జనమంతా.... అమ్మకాల ప్రక్రియ ప్రారంభం కావటంతో దుకాణాల వద్ద క్యూకట్టారు. పెరిగిన ధరల ప్రభావంతో కొన్ని చోట్ల మాత్రం పెద్దగా మందుబాబుల తాకిడి కనిపించలేదు.
ధరలు పెంచటంతో ఆందోళనలో మందుబాబులు - 2nd day wins rush in chittoor dst
మద్యం దుకాణాలు తెరిచినందుకు మందుబాబులు ఆనందగా ఉన్నా... ధరలు అమాంతం పెంచటంతో మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజూ మద్యం దుకాణాల ముందు తాకిడి ఏమాత్రం తగ్గలేదు.
2nd day corud in chittoor dst wins shop