భాజపా జాతీయ అధ్యక్షుడు 'అమిత్ షా కాదు అబద్ధాల షా' అని యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రానికి 5లక్షల 56వేల 985 కోట్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పాటు ఇచ్చేవి కాదనీ.. ఏపీకి ప్రత్యేకంగా రావాల్సిన వాటి గురించి అడుగుతున్నామని స్పష్టంచేశారు. ఈ ఐదేళ్లలో భాజపా రాష్ట్రాలకు ఎంతిచ్చారో.. ఏపీకి ఎంత ఇచ్చారో... దానిమీద శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం మోదీ, షాలకు ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున ఇచ్చే ధైర్యం లేకపోతే కనీసం పార్టీ తరఫున అయినా ఇవ్వాలని సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఎందుకివ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలవరానికి ఇవ్వాల్సిన 4వేల 500 కోట్లు ఇవ్వకుండా.. ఏటీఎం అని ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. ఓటమి భయంతో మోదీ, షాల వేధింపులు ఎక్కువయ్యాయని విమర్శించారు. భాజపాను ప్రశ్నించిన ముఖ్యమంత్రులనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీకి లొంగిన వారిపై వేధింపులు లేవన్నారు. కమలానికి రేకుల్లా ఉన్న అద్వాణీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా వారు పార్టీని వదిలేశారనీ.. ఇప్పుడు మోదీ రేకులు రాలిన కమలం లాంటివారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కారు రేకు, జగన్ ఫ్యాన్ రేకు అతుకులు వేసుకుంటున్నారని చురకలంటించారు.
'రేకులు రాలిన కమలం.. రాఫెల్ బురదలో పడింది'
భాజపా జాతీయ అధ్యక్షుడు 'అమిత్ షా కాదు అబద్ధాల షా' అని యనమల రామకృష్ణుడు విమర్శించారు. రాష్ట్రానికి 5లక్షల 56వేల 985 కోట్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు.
యనమల రామకృష్ణుడు