ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​లో నీటి నిర్వహణ.. దేశానికే ఆదర్శం! - ప్రదీప్ కుమార్ సిన్హా

ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న నీటి యాజమాన్య నిర్వహణ, ప్రణాళికా విధానాలను దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించాల్సిన అవసరముందని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజర్వారయర్లలో నీటి నిల్వలను తెలుసుకునేందుకు సెన్సార్ల వినియోగంతో పాటు.. మొబైల్ యాప్​కు అనుసంధానించటం సత్ఫలితాలకు కారణమైందని అభినందించింది.

ఆంధ్రప్రదేశ్​లో నీటి నిర్వహణ.. దేశానికే ఆదర్శం!

By

Published : May 27, 2019, 8:11 AM IST

రాష్ట్రాల్లో నీటి నిర్వహణపై.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా.. టెలీకాన్ఫరెన్స్ చేశారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ ప్రాంతాల్లోని విధానాలను వివరించారు. ఈ సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న విధానాలపై.. సిన్హా ప్రశంసలు కురిపించారు. రియల్ టైమ్ పద్ధతిలో నీటి ప్రణాళిక, వాటర్ బ్యాలెన్స్, నీటికి సంబంధించిన ఆడిట్ నిర్వహణ బాగుందన్నారు.

నీటి నిర్వహణ భేష్
ఏపీ అనుసరిస్తున్న విధానాలను వివరించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్​మెంట్ ద్వారా రిజర్వాయర్లు, ఇతర తాగునీటి వనరుల్లో నీటిలభ్యతను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలిపారు. 100కు పైగా రిజర్వాయర్లలో నీటి లెవెల్ సెన్సార్లను మొబైల్ యాప్​న​కు అనుసంధానించినట్టు వివరించారు. ఆయా రిజర్వాయర్లలో ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోను ఎప్పటికప్పుడు తెలుసుకుని నీటి నిర్వహణ చేపడుతున్నట్లు చెప్పారు. ''రాష్ట్ర వ్యాప్తంగా 1200కు పైగా ఫిజోమీటర్లు, టెలిమెట్రీ పరికరాల ద్వారా భూగర్భజల మట్టాన్ని రియల్ టైమ్‌లో అంచనా వేస్తున్నాం. 38వేలకు పైగా సాగునీటి చెరువులకు జియో ట్యాగింగ్ ద్వారా శాటిలైట్ వాటర్ స్పెడ్ ఏరియా పరిస్థితులనూ మొబైల్ యాప్ ద్వారానే పర్యవేక్షిస్తున్నాం. వ్యవసాయం, గృహ, పశువులకు నీటి లభ్యత, పరిశ్రమల అవసరాలకు తగిన నీటి డిమాండ్​ను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జూలై 15లోగా సాధారణ వర్షపాతం నమోదు కాకుంటే అవసరమైన ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేసేందుకు సన్నద్ధమయ్యాం''.. అని సీఎస్ చెప్పారు.వర్షాభావ పరిస్థితులు తలెత్తితే సమస్యను అధిగమించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సిన్హా సూచించారు.

ABOUT THE AUTHOR

...view details