తెలుగు విద్యార్థులకు అండ - ap nrt
అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థలకు అండగా ఉంటామని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు రవికుమార్ వేమూరి స్పష్టం చేశారు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్న విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
అమెరికాలో చదువుతున్న తెలుగు విద్యార్థులను అరెస్ట్ చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తమని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షులు రవికుమార్ వేమూరి స్పష్టం చేశారు. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఏపీఎన్ఆర్టీ తరపున అమెరికాలోని తెలుగు విద్యార్థులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని...తమ హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేస్తే కావాల్సిన సమాచారం అందిస్తామని వెల్లడించారు. తెలుగు విద్యార్థులు విదేశాలకు వెళ్లేముందుకు అక్కడి చట్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.