ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ సమీక్ష - starts today
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ విలీనానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయన నివేదికను 3 నెలల్లో ఇవ్వాలని కమిటీని జగన్ ఆదేశించారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ విలీనానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయన నివేదికను 3 నెలల్లో ఇవ్వాలని కమిటీని జగన్ ఆదేశించారు. ఆర్టీసీని లాభాల బాటలో నడపడం,.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, కార్మికుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా సిఫార్సులు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్టీసీని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని జగన్ సూచించారు. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా డీజిల్ వ్యయం తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాలని.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా మెరుగైన విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.