ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గర్జించిన గళాలు! - నిరసన

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఎంపీలు గల్లా, రామ్మోహన్ నాయుడులు లోక్​సభ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. . మిస్టర్ పీఎం... ఆంధ్రప్రదేశ్ ప్రజలను "మీరు మోసగించారు.. అంటూ..గల్లా మరోసారి గలమెత్తారు.

పార్లమెంట్​లో ఎంపీల పోరాటం

By

Published : Feb 9, 2019, 6:36 PM IST

Updated : Feb 9, 2019, 6:43 PM IST

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ...
ఏడాది క్రితం.. వినిపించిన ఈ వాక్కును విని.. యావత్ లోక్​సభ అవాక్కయింది. ఆ పిలుపు ఏమంత తప్పు కానప్పటికీ.. ప్రధాని స్థాయి వ్యక్తిని సభా మధ్యన ఆ రకంగా సంబోధించడం అదే మొదటిసారి. లోక్​సభకు తొలిసారి ఎన్నికైన గుంటూరు ఎంపీ.. గల్లా జయదేవ్ ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి చేసిన సంబోధన అది.. ! విభజనతో తీవ్రంగా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్ గొంతును పార్లమెంట్ వేదికగా గొంతెత్తి చాటినందుకు ఆయనపై రాష్ట్రంలోనూ.. కేంద్రంపై సమర్థంగా స్పందించారంటూ.. జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు కురిశాయి. కిందటి సాధారణ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అసాధారణ రీతిలో బయటకొచ్చింది. విభజన హామీల అమలుపై దాదాపు నాలుగేళ్ల ఎదురుచూపులకూ.. ఏమాత్రం స్పందన లేకపోవడంతో పోరుబాట..బట్టిన తెలుగుదేశ ప్రభుత్వ అజెండాను చట్ట సభల్లో సమర్థంగా వినిపించారు గల్లా జయదేవ్.. ! రాజకీయాలకు కొత్త అయినా.. ఏమాత్రం అదర్లేదు.. బెదర్లేదు.. సూటిగా స్పష్టంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశం ముంగిట ఉంచగలిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయానికొచ్చాక.. తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా పంథా మార్చింది. కేంద్రంలో బలంగా ఉన్న మోదీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలంటే.. ఇటు రాష్ట్రంలోనే కాదు.. అటు జాతీయ స్థాయిలోనూ.. ఎండగట్టాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను చాలా సమర్థంగా నిర్వహించింది గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ , శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహననాయుడులే. విభజన హామీలపై చర్చలో కానీ.. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కానీ..లేకుంటే.. నిన్నటి బడ్జెట్ చర్చలో కానీ...ఈ ఇద్దరి గళాలు.. మారుమోగాయి.. .
తెలుగుదేశం పార్టీ ...ఇప్పుడే కాదు..ఎప్పుడూ జాతీయ రాజకీయాల్లో సంచలనమే..పార్టీ ఆవిర్భావం నాటికి దేశంలో ఉన్న పరిస్థితులకు ఓ ప్రత్యామ్నాయ వేదిక. పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ అది.. ఆ తర్వాత కేంద్రంలో ఏర్పైటైన నాలుగు సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ప్రభావం చూపిన వారే.. అందుకే విభజన విషయంలో కేంద్రం వైఖరిని ఆ పార్టీ చాలా సమర్థంగా ఎదుర్కోగలిగింది. ఓ ప్రాంతీయ పార్టీగా ఉండి అధికార పార్టీపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురాగలిగింది.
పార్లమెంటే వేదికగా...
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై క్షేత్రస్థాయిలోనే కాదు.. .సమర్థంగా చట్టసభల ముందుకు తేవడం అన్నది అసలు సవాలు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని కేంద్రం ఖాతరు చేయడం లేదనే విషయాన్ని పార్లమెంట్ లోనే గట్టిగా వినిపించాలని తెదేపా భావించింది. ఆ వ్యూహాన్ని ఈ ఇరువురు ఎంపీలు సమర్థంగా అమలు చేశారు. అమెరికాలో పెరిగిన జయదేవ్... స్పష్టమైన ఆంగ్ల పరిజ్ఞానంతో.. కేంద్రం చేసిన అన్యాయాన్ని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మాజీ మంత్రి ఎర్రనాయుడు రాజకీయ వారసుడిగా.. లోక్ సభలో అడుగుపెట్టిన యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు .. తండ్రిలాగే లోక్ సభలో గర్జించారు. ఇంగ్లీషు.. హిందీలో తన ఆవేశపూరిత ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. సభ్యులుగా గల్లా, రామ్మోహన్ లు పార్లమెంట్ లో మొదటిసారిగా అడుగుపెట్టినప్పటికి వారి ప్రసంగాలపై .. స్పందించిన తీరుపై జాతీయ స్థాయి నేతలు కూడా ప్రశంసలు కురిపించారు.

పార్లమెంట్​లో ఎంపీల పోరాటం

మిస్టర్ పీఎం... ఇచ్చిన హామీలు వాస్తవం కాదా..?
తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచేయి చూపింది మోదీ సర్కార్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది తెలుగుదేశం పార్టీ. మరోవైపు ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఎంపీలు గల్లా, రామ్మోహన్ నాయుడులు లోక్ సభ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. . మిస్టర్ పీఎం... ఆంధ్రప్రదేశ్ ప్రజలను "మీరు మోసగించారు.. అంటూ.. గల్లా జయదేవ్ మరోసారి వెంటబడ్డారు. . తిరుపతి వెంకన్న సాక్షిగా దిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. రామ్మోహననాయుడు మరోసారి ధాటిగా తన వాదన వినిపించారు. 16 వ లోక్​సభలో రాష్ట్ర వాదన వినిపించిన హీరోలుగా వీరు నిలిచారు.
Last Updated : Feb 9, 2019, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details