ప్రచారానికి.. బడ్జెట్‌కు పొంతన లేదు: విపక్షాలు - ram madhav
''కొత్త సీసాలో పాతనీరు.. వైకాపా నేతల ప్రచారానికి లెక్కలకు పొంతన లేదు... కీలక శాఖలకు తక్కువ నిధులు'' అంటూ బడ్జెట్ పై విపక్ష నేతలు విమర్శలు చేశారు.
వైకాపా నేతల ప్రచారానికీ, బడ్జెట్‌లో కేటాయింపులకు ఎక్కడా పొంతన లేదని ప్రతిపక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. కొత్త సీసాలో పాత సారా చందంగా బడ్జెట్ ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. పథకాలకు పేర్లు బాగున్నాయి గాని కేటాయింపుల్లేవని ఆక్షేపించారు. ఇది రైతులకు మేలు చేకూర్చే బడ్జెట్ కాదని... కేవలం అంకెల గారడీ బడ్జెట్ అని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కోసం 18 వేల కోట్లు కేటాయించాలని అడిగిందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు గుర్తు చేశారు. ఇప్పుడు కేవలం 250 కోట్ల రూపాయలతో సరిపెట్టిందని విమర్శించారు. యువజన శాఖకు కేటాయింపుల్లో 75 శాతం కోత విధించారని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. కేంద్రం సహకారంతో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.