విజయవాడ ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్పొరేట్ కళాశాలలు వేసవి సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇంటర్ బోర్డు అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్ బోర్డు ముందు విద్యార్థుల ఆందోళన
విజయవాడ ఇంటర్ బోర్డు వద్ద ఎస్ఎఫ్ఐ, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వేసవిలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తోన్న కళాశాలలపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్ బోర్డు ముందు పోలీసులు-విద్యార్థి సంఘ నేతల మధ్య తోపులాట
నిబంధనలను ఉల్లంఘించిన కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అధికారులను కలవకముందే విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై... విద్యార్థి సంఘ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఘటనకు కారణమైన కృష్ణా జిల్లా ఆర్ఐవోపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నిరసనకు దిగింది.
ఇవీ చూడండి : దానిమ్మకు చీర కొంగు రక్ష...!