వైకాపాది 'సెలెక్ట్ అండ్ ఎలక్ట్ మెథడ్ ':దేవినేని - avanthi
వైకాపా అధ్యక్షుడు జగన్ సెలక్ట్ చేసుకుని నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు . భాజపా, కేసీఆర్ దర్శకత్వంలోనే జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు.
ఆమంచి, అవంతి శ్రీనివాస్ తదితరులు పార్టీ మారటంపై దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. వారు పార్టీలు మారినా తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే.. వైకాపా మాత్రం.. తెదేపా ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. కేసీఆర్, భాజపా వ్యూహంలో భాగంగానే జగన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. 'సెలక్ట్ అండ్ ఎలక్ట్' పద్ధతిలో వైకాపా రాజకీయాలు చేస్తోందన్నారు. తెదేపా ప్రభుత్వంలో ఉండి పనులు చేయించుకున్న వారు... ఇప్పుడు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.