పీపుల్స్హబ్ నుంచి పథకాల అమలు! - annadata sukhibhava
సంక్షేమ పథకాల అర్హులను పీపుల్స్హబ్ నుంచి గుర్తిస్తున్నట్టు ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు తెలిపారు. 30 పథకాలను ఈ ప్రక్రియతోనే అమలు చేస్తున్నట్టు చెప్పారు.
అమరావతి
అన్నదాత సుఖీభవకు పీపుల్స్ హబ్ నుంచి వచ్చిన డేటానే ఉపయోగించామని ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు తెలిపారు. కేంద్రం పెట్టుబడి సాయం కూడా ఈ సమాచారం ఆధారంగానే అమలు చేస్తున్నామన్నారు. కనుబొమ్మలు, వేలిముద్రలు లేకుండా ఆధార్ సమాచారం బయటకు రాదని తెలిపారు. 30 పథకాలను పీపుల్స్ హబ్ నుంచి అమలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.ఇక్కడి నుంచే సంక్షేమ పథకాల అర్హులను గుర్తిస్తున్నామన్నారు.