విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజేంద్రనాథ్ రెడ్డి
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ సముదాయంలోని విజిలెన్స్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
rajendranath_reddy_take as_charge_vigilence_enforcement_dg
జిల్లాల వారీగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగాన్ని పటిష్ఠం చేసి....సమీక్ష అనంతరం ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నదానిపై దృష్టి సారిస్తామని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో అవినీతి, అవకతవకలు జరిగాయా? లేదా? అనేది పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలనేది తమ ఉద్దేశమని స్పష్టం చేశారు.