నిలిచిన సహాయ ఆచార్య పోస్టుల ఇంటర్వ్యూలు ! - ఆచార్య ఎన్టీరంగా
ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి ఈనెల 29 నుంచి జులై 7 వరకూ జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిచిపోయాయి. అధికారులు అంతా సిద్ధం చేసుకున్న తర్వాత వ్యవసాయ శాఖ కార్యదర్శి రాజశేఖర్ ఆపివేయలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ng_ranga_university_assistant_proffesior_posts_intreviw_stopped
సహాయ ఆచార్య పోస్టుల ఇంటర్వూలు నిర్వహించాలని విశ్వవిద్యాలయ అధికారులు షెడ్యూల్ సిద్ధం చేసుకోవటంతో పాటు అభ్యర్థులకు కాల్ లెటర్లు కూడా పంపారు. ఈ సమయంలో ముఖాముఖీలు ఆపివేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగా అధికారుల్లో గందరగోళం... అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.