ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు రాజ్​భవన్​లో గవర్నర్ ఇఫ్తార్ విందు - govnerner

హైదరాబాద్ రాజ్​భవన్​లో ఈరోజు గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

నేడు రాజ్​భవన్​లో గవర్నర్ ఇఫ్తార్ విందు

By

Published : Jun 1, 2019, 6:06 AM IST

నేడు రాజ్​భవన్​లో గవర్నర్ ఇఫ్తార్ విందు

నేడు రాజ్​భవన్​లో గవర్నర్ నరసింహన్ రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ​ ముఖ్యమంత్రులు జగన్​మోహన్ రెడ్డి, కేసీఆర్ హాజరుకానున్నారు. సాయంత్రం 6.53 గంటలకు జరిగే విందుకు సీఎంలను గవర్నర్ ఆహ్వానించగా.. వారు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్​లో కేసీఆర్​తో కలిసి పాల్గొనే మొదటి కార్యక్రమం ఇదే కానుంది!

విందు తర్వాత భేటీ!

ఇఫ్తార్ విందు ముగిసిన తర్వాత గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, సచివాలయ భవనాలు, శాఖాధిపతుల కార్యాలయాల భవనాలు అప్పగించే అంశాలపై చర్చించనున్నారు.ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆంక్షలపై కూడా ఈ భేటీలో చర్చకు రానున్నట్లు సమాచారం. తొమ్మిదో, పదో షెడ్యూలు సంస్థల విభజనను ఆర్నెల్ల వ్యవధిలో పూర్తి చేయాలనే ఆలోచన వీరిద్దరికీ ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటి కోసం ముందుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని ముందుగా నిర్వహించాలని భావిస్తున్నారు.

ఇవీ చూడండి: నేటి నుంచి ప్రభుత్వ శాఖలపై సీఎం జగన్ సమీక్షలు

ABOUT THE AUTHOR

...view details